భారత్ లో కొత్తగా 7145 కరోనా కేసులు

భారత్ లో కొత్తగా 7145 కరోనా కేసులున్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కు చేరింది. ఇందులో 3,41,71,471 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,77,158 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు.

ఇంకా 84,565 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దీంతో యాక్టివ్ కేసులు 569 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెల్పింది. గత 24 గంటల్లో 8706 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో 289 మంది మృతి చెందారని వెల్లడించింది. ఇప్పటి వరకు 1,36,66,05,173 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని ప్రకటించింది.