చేతిలో ఉరితాడుతో ఓ రైతు వింత నిరసన

చేతిలో ఉరితాడుతో ఓ రైతు వింత నిరసన

చేతిలో ఉరితాడుతో ఓ రైతు వింత నిరసన

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తమ భూమిని బీఆర్ఎస్ నేత తప్పుడు పత్రాలతో తమ్ముడి పేరిట రాయించుకున్నాడని వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పోనకల్ గ్రామానికి చెందిన రైతు గట్ల సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం దక్కలేదన్నారు. న్యాయం కోసం లంచం ఇవ్వలేనంటూ నిరసనకు దిగాడు.

ఫ్లెక్సీ కట్టిన నాగలిని భుజాన వేసుకుని , చేతిలో ఉరితాడు పట్టుకుని ఇందిరా పార్కు నుంచి డీజీపీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లాడు. అయినా తన కష్టం వృథానే అయ్యింది. డీజీపీని కలిసేందుకు అనుమతించకపోవడంతో ఆ రైతు కన్నీళ్లపర్యంతమయ్యాడు.