మెట్టుగుట్టలో ఎమ్మెల్యే అరూరి ప్రత్యేక పూజలు 

మెట్టుగుట్టలో ఎమ్మెల్యే అరూరి ప్రత్యేక పూజలు

మెట్టుగుట్టలో ఎమ్మెల్యే అరూరి ప్రత్యేక పూజలు 

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మడికొండలోని మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరికి, వారి కుటుంబసభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ రామలింగేశ్వరస్వామికి అరూరి రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామలింగేశ్వరస్వామికి జలాభిషేకం, పాలాభిషేకం, పుష్పిభిషేకం చేసి, రుద్రాక్ష మాలను స్వామి వారికి అర్పించారు.

ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ ప్రధానార్చకులు అభిషేక్ శర్మ స్వామి వారి ఆశీర్వచనలు అందజేశారు. స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, వర్దన్నపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, ఆలయ కమిటీ చైర్మన్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.