శ్రీ రుద్రేశ్వరుడికి దాస్యం ప్రత్యేక పూజలు

శ్రీ రుద్రేశ్వరుడికి దాస్యం ప్రత్యేక పూజలు

శ్రీ రుద్రేశ్వరుడికి దాస్యం ప్రత్యేక పూజలువరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : శివుడి ఆశీస్సులు ప్రజలందరీపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా నగరంలోని వేయి స్తంభాల దేవాలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ అండ్ ఫ్యామిలీని ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చీఫ్ విప్ దాస్యం కుటుంబసమేతంగా శ్రీ రుద్రేశ్వరస్వామికి అభిషేకం , అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.

తదనంతరం చీఫ్ విప్ మాట్లాడారు. లోక కళ్యాణార్ధం మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. శివుని ఆశీస్సులతో సీఎం కేసీఆర్ , రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు.అదే విధంగా కేసీఆర్ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని మహా శివుడిని ప్రార్థించామని తెలిపారు. తదనంతరం ఆలయ అర్చకులు వేద వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.