సంగారెడ్డి జిల్లా: మనూరు మండలం రావిపల్లి బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి అరుణ అనే వ్యవసాయశాఖ అధికారిణి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం అరుణ సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి కారులో వచ్చిన అరుణ బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి బలవన్మరనానికి పాల్పడ్డారు. విషయం అందుకున్న అధికారులు గల్లంతు అయిన అరుణ కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.