ఘనంగా అల్లం నారాయణ బర్త్ డే వేడుకలు

ఘనంగా అల్లం నారాయణ బర్త్ డే వేడుకలువరంగల్ అర్బన్ జిల్లా: అక్షర సేనాపతి, జర్నలిస్టుల పక్షపాతి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అని టీయూడబ్ల్యూజే(హెచ్_143) రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి బీఆర్ లెనిన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గాజులపల్లి ముద్దు బిడ్డ అల్లం నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీయూడబ్ల్యూజే(హెచ్_143) వరంగల్ అర్బన్ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో అల్లం సార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ లెనిన్ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలను ప్రారంభించారు. అల్లం సార్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం అవిరళంగా కృషి చేస్తున్న అల్లం నారాయణ కలకాలం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ల జీవించాలని వరంగల్ ఉమ్మడి జిల్లా జర్నలిస్ట్ ల పక్షాన కోరుతున్నట్లు తెలిపాడు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్న శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్, టెంజు అధ్యక్షులు పొగాకుల అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు తిపిరిశెట్టి శ్రీనివాస్ , జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అంతడుపుల శ్రీనివాస్, జిల్లా నాయకులు ఎన్జీవీ జిల్లా ఇంఛార్జి అరుణ్ కుమార్, ఎబిఎన్ జిల్లా ఇంచార్జి నవీన్ కుమార్, ప్రభాకర్, రాకేష్, విజయ్ , హరీష్ తదితరులు పాల్గొన్నారు.