మరో విక్టరీ సాధించిన ఆర్సీబీ

మరో విక్టరీ సాధించిన ఆర్సీబీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయం సాధించింది. సమిష్టిగా రాణించిన బెంగళూరు జట్టు, రాహుల్ సేనను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ (96) ఆదుకున్నాడు. ఆరంభంలోనే అనూజ్ రావత్ (4), కోహ్లీ (0) వికెట్లు కోల్పోయిన జట్టు బ్యాటింగ్ లైనప్ కూలిపోకుండా అడ్డుకున్నాడు. అతనికి మ్యాక్స్ వెల్ (23), షాబాజ్ అహ్మద్ (26) మంచి సహకారం అందించారు. ఈ క్రమంలో 20 ఓవర్లకు బెంగళూరు జట్టు 181/6 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నోను హాజిల్ వుడ్ ప్రారంభంలోనే దెబ్బకొట్టాడు. ప్రమాదకరమైన డీకాక్ (3), మనీష్ పాండే (6) వికెట్లు కూల్చాడు. పవర్ ప్లేలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన జట్టును కేఎల్ రాహుల్ (30), కృనాల్ పాండ్యా (42) ఆదుకున్నారు. అయితే వీళ్లిద్దరూ కూడా ఔటైన తర్వాత ఆ జట్టు ఏ కోశానా కోలుకునేలా కనిపించలేదు.మరో విక్టరీ సాధించిన ఆర్సీబీదీపక్ హుడా (13), ఆయూష్ బదోని (13), మార్కస్ స్టొయినిస్ (24) స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరాడు. గెలిపిస్తాడనుకున్న స్టొయినిస్ కూడా అవుటవడంతో లక్నో అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. ఐదే చివర్లో జేసన్ హోల్డర్ (16) కొంత ఆశ కల్పించాడు. కానీ హర్షల్ పటేల్ బౌలింగ్ లో సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగల్గింది. బెంగళూరు బౌలర్లలో హాజిల్ వుడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. సిరాజ్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ తీశారు.