సిడ్నీ: ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్‌కు ఆరంభంలోనే ఝలక్ తగిలింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం సిడ్నీ మైదానంలో జరుగుతుంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల భారీ ఛేదనలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్లకు పరుగులు చేసింది.