దుర్యోధన్​ నేగికి కరోనా పాజిటివ్​

దుర్యోధన్​ నేగికి కరోనా పాజిటివ్​న్యూఢిల్లీ: మాజీ నేషనల్​ చాంపియన్​ భారత్​ బాక్సర్​ దుర్యోదన్​ నేగి కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనలో వ్యాధి లక్షణాలు ఏమీ లేవని అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా దవాఖానలో చేర్పించామని స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా తెలిపింది. పాటియాలాలోని జాతీయ శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న నేగి ఇటీవల దీపావళి పండుగకు సెలవుపై ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చిన తరువాత ఆయనను క్వారంటైన్​లో ఉంచి కోవిడ్​ టెస్ట్​ చేయగా వైరస్​ సోకిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కొలంబియా ఏసియా దవాఖానలో వైద్య చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు.