భూకబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్​ అరెస్ట్​

భూకబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్​ అరెస్ట్​

భూకబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్​ అరెస్ట్​

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ లో అధికార పార్టీకి భారీ కుదుపు. ల్యాండ్ కబ్జా ఆరోపణల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7వ డివిజన్ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కబ్జాల నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు నాన్​బెయిలబుల్​ కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం సెకండ్ అడిషనల్​ జ్యుడిషియల్ ఫస్ట్​ క్లాస్​ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు.

హన్మకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2లోని 200 గజాల స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ​డెవలప్​మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్​ ఓనర్​ సునీత దంపతులను హెచ్చరించాడు. వాళ్లు నో చెప్పడంతో, తప్పుడు ధ్రువ పత్రాలతో సర్వే నంబర్ 648లోని స్థలం ఇదేనంటూ ఫిర్యాది స్థలంలోకి అక్రమంగా ప్రవేశించాడు కార్పొరేటర్. తన అనుచరులతో కలిసి ల్యాండ్​మీదికి వెళ్లి కాంపౌండ్​వాల్​ను కూల్చి నేలమట్టం చేయడంతో పాటు బాధితుల భూమిలో హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. దీంతో కంగుతిన్ని బాధితులు సునీత దంపతులు సదరు కార్పొరేటర్ పై, బాధితుల స్థలానికి యజమానిగా పేర్కొంటూ కార్పొరేటర్ రిజిస్ట్రేషన్ చేసిన స్థల యజమానులుగా చలామనిఅవుతున్న అతని అనుచరులైన ముగ్గురిపై నాలుగు రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ అనంతరం సీపీ ఏవీ రంగనాథ్ ​ఆదేశాలతో కార్పొరేటర్​ వేముల శ్రీనివాస్​తో పాటు అతని డ్రైవర్​ పడాల కుమారస్వామిపై ఐపీసీ 427,447,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం నిందితులకు వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్​ జేఎఫ్​సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్ ​ఆదేశాలతో ఖమ్మం జైలుకు తరలించారు.