రద్దైన ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్

హైదరాబాద్: ఈ నెల 5న నిర్వహించిన ఎమ్మెస్సీ ఫిజిక్స్ ప్రవేశ పరీక్ష రద్దయ్యింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిసెంబర్ 1 నుంచి ఎంట్రెన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 5న ఎమ్మెస్సీ ఫిజిక్స్ ప్రవేశ పరీక్ష జరిగింది. అయితే ఈ పరీక్షను డిసెంబర్ 11న మళ్లీ నిర్వహిస్తామని సీపీ గెట్ కన్వీనర్ ఎన్.కిషన్ తెలిపారు. ఈ పరీక్షను వచ్చేశుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 2.30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా భారత్ బంద్ వల్ల డిసెంబర్ 8న వాయిదాపడిన పరీక్షలను ఈనెల 14న నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సెంటర్లు మారే అవకాశం వుందని తెలిపారు. అందువల్ల అధికారిక వెబ్ సైట్ www.cpget.tsche.ac.in, www.tscpget.com నుంచి మరోమారు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.