వీరి ఉద్యోగాలు అవుట్ పాపం

వీరి ఉద్యోగాలు అవుట్ పాపంగుంటూరు జిల్లా : వార్డు సచివాలయ నిబంధనలకు విరుద్ధంగా తెనాలి కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వార్డు రెవెన్యూ సెక్రటరీని జిల్లా కలెక్టర్​కు సరెండర్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ వేడుకలో ప్రత్యక్షంగా పాల్గొన్న మరో ఆరుగురు వార్డు వలంటీర్లు విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టణంలోని ఐదో వార్డు సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ గా పనిచేస్తున్న స్రవంతి జన్మదిన వేడుకలను గత నెల 19న సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టాల్సిందిగా జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్​ను​ ఆదేశించారు. దీనిపై విచారణ జరిపిన కమిషనర్ స్రవంతిని జిల్లా కలెక్టర్​కు సరెండర్ చేశారు. అలాగే వార్డు వలంటీర్లు రత్నకుమారి, ఎస్ అలేఖ్య ,ప్రభు కుమార్, ఎస్ కే రెహ మున్నీసా, లావణ్య, టీ లీలా హరీష్ లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.