ఆసీస్​కు షాక్​

ఆసీస్​కు షాక్​సిడ్నీ : టీమీండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ డిసెంబర్​ 17 నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల ప్లేయర్స్​ మొదటి టెస్టు (డై అండ్​ నైట్​) కోసం సిద్ధమవుతున్నారు. భారత్​తో సన్నాహాక మ్యాచ్​లో నలుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కంకషన్​కు గురైన విషయం విదితమే. అయితే మంగళవారం ఆసీస్​ జట్టు సాధన చేసింది. ప్రాక్టీస్​ ప్రారంభమైన పది నిమిషాలకే స్మిత్​ డ్రెస్సింగ్​ గదికి తిరిగి వెళ్లిపోయాడు. మళ్లీ బ్యాటింగ్ సాధన చేసేందుకు నెట్స్​కు రాలేదు. బుధవారం స్మిత్​ శిక్షణకు దూరంగా ఉంటాడని క్రికెట్​ ఆసీస్​ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. బంతిని అందుకునే క్రమంలో అతడు గాయపడ్డాడని తెలిపారు. స్మిత్​ వెన్నునొప్పికి చికిత్స తీసుకుంటున్నాడని ప్రతినిధి వెల్లడించారు. డేవిడ్​ వార్నర్​, పుకోస్కీ ఇదివరకే గాయాలపాలైన విషయం విదితమే.