బిగాల గణేశ్​కు సీఎం కేసీఆర్​ పరామర్శ

బిగాల గణేశ్​కు సీఎం కేసీఆర్​ పరామర్శనిజామాబాద్ జిల్లా : నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే బిగాల గణేశ్​గుప్తా తండ్రి ఇటీవల మరణించారు. కాగా బుధవారం మక్లూర్​ మండలకేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో సీఎం కేసీఆర్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేశ్​గుప్తా తండ్రి కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గణేశ్​గుప్తాను, కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. పరామర్శించిన వారిలో సీఎం వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు సురేష్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు సురేందర్, హన్మంత్ షిండే, జీవన్ రెడ్డి ఉన్నారు.

బిగాల గణేశ్​కు సీఎం కేసీఆర్​ పరామర్శ