చల్లా సమక్షంలో బీఆర్ఎస్ లో కాంగ్రెస్ చేరికలు

చల్లా సమక్షంలో బీఆర్ఎస్ లో కాంగ్రెస్ చేరికలు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలకతీతంగా పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనాతీరు, అభివృద్ధిని చూసి యువత బీఆర్ఎస్ వైపే ఆసక్తి చూపుతోందని ఎమ్మెల్యే చల్లా అన్నారు. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ ఖతమేనని ఆయన అన్నారు. శుక్రవారం గీసుగోండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు బీఆర్‌ఎస్ లో చేరారు. హనుమకొండలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులకు ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మండల ముఖ్య నాయకులు, నాయకులు, యువకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.చల్లా సమక్షంలో బీఆర్ఎస్ లో కాంగ్రెస్ చేరికలునేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ కుటుంబం ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతీ పేదవాడి గుండెలో కేసీఆర్‌ ఉంటారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ప్రజలు హర్షిస్తున్నారని కొనియాడారు. పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన అన్నారు.

పార్టీలో చేరిన వారిలో గట్టు రాజు, జక్కుల రవి, సమ్మయ్య, సంపత్, కొండం అశోక్, గడ్డల రాజు, కడారి కుమారస్వామి, కంచు నారాయణ, దూడ మహేందర్, గాదం లక్ష్మణ్, చిట్టే సమ్మయ్య, గాధం ప్రవీణ్, యాట రాజు, దూడే రాజు, పల్లె నరేష్, ముద్దేరబోయిన యాకయ్య, నాగనాబోయిన యాకయ్య, గట్టు జయపాల్ రెడ్డి, దూడే చంద్రు మరియు కొండం అనిల్ తో పాటు పలువురు చేరారు.