టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి..?

టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి..?హైదరాబాద్: బల్దియా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభావంకు గురికావడంతో దానికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ ప్రెసిడెంట్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి, తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీకి పంపించారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాను స్వీకరించిన కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిని మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కట్టబెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నెరవేర్చని హామీలను ఎత్తి చూపుతూ , కాంగ్రెస్ పార్టీలో చురుకుగా తనదైన పాత్ర పోషిస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ దిశగా టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని డిసెంబర్ 09న అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నారు.