మెగాస్టార్ కు రెండో సారి కరోనా

మెగాస్టార్ కు రెండో సారి కరోనాహైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి రెండోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా చిరంజీవి వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని మెగాస్టార్ సూచించారు. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను అని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. 2020, నవంబర్ 9న చిరంజీవి తొలిసారి కరోనా బారినపడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించాలని కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ తేలిందని ఆయన అప్పట్లో ప్రకటించారు.