టీఆర్ఎస్ తోనే అభివృద్ధి: ఎమ్మెల్యే చల్లా

టీఆర్ఎస్ తోనే అభివృద్ధి: ఎమ్మెల్యే చల్లావరంగల్ రూరల్ : రైతాంగానికి అండగా వుంటూ వారి అభివృద్ధికి శక్తివంచన లేకుండా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ ధర్మారం గ్రామంలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మునిసిపాలిటీలోని విలీన గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని వివరించారు. ఒక్క 3వ డివిజన్ లోనే రూ.23.00 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. అయితే టీఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తూ బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. కేంద్రం ప్రశేశపెట్టిన వ్యవసాయ చట్టాల కారణంగా దేశానికి అన్నం పెట్టే రైతు రోడ్ల మీద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.