రజినీకాంత్​ పార్టీపేరు, గుర్తు ఖరారు

రజినీకాంత్​ పార్టీపేరు, గుర్తు ఖరారుచెన్నై: తమిళ సూపర్ ​స్టార్ రజనీకాంత్​ కొత్త పార్టీ పనులను వేగవంతం చేశారు. రజనీకాంత్​ కొత్తపార్టీ పేరు‘మక్కల్​సేవై కర్చీ (ప్రజాసేవపార్టీ) అనే పేరు ఖరారైంది. అలాగే పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్​ కమిషన్​ ఖరారు చేసింది. రజనీకాంత్​ తాను నటించిన భాషా సినిమాలో ఆటో డ్రైవర్​గా కనిపించారు. ఈ చిత్రంతో రజనీకి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ ఆటోను తన ఎన్నికల గుర్తుగా మార్చుకోవాలని​ ఫ్యాన్స్​ సూపర్​స్టార్​ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆటో సింబలే మీకు, మీ పార్టీకి కరెక్టు సూట్​ అవుతుందని రజనీకాంత్ కు​ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎన్నికల గుర్తుగా ఆటోను ఎంపికచేసుకున్నారు. రజనీకాంత్​ ఎంపిక చేసుకున్న ఆ బొమ్మ గుర్తు గురించి తెలుసుకుందాం. ఆ గుర్తు ఎలా ఉందంటే పసుపు కలర్​ ఆటో, ఆటో ముందు బజాజ్​ కంపెనీ పేరుకు బదులుగా బాద్​షా అనే పేరుతో ఉంది. ఆటోలో నుంచి రజినీకాంత్​ వంగి చూసి తన యూనిఫామ్​ కాలర్​ తన వేలితో పట్టి ఎగరవేసే ఫోటోతో ఆ గుర్తు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్​ మీడియాలో వైరలవుతోంది. ఇదే బొమ్మను తన పార్టీ గుర్తుగా ఏర్పాటు చేసుకోవాలని అభిమానులు మరియు సోషల్​మీడియాలో నెటిజన్లు బలంగా కోరడంతో రజినీకాంత్​ ఇదే గుర్తును తన పార్టీ గుర్తుగా ఎంపిక చేయాలని ఎన్నికల కమిషన్​ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆలోచించిన ఎన్నికల కమిషన్​ మధ్యాహ్నం సమయంలో ఆ గుర్తును ఖరారు చేసింది. అభిమానుల అనుకున్న గుర్తే ఈసీ ఖరారు చేయడంతో తలైవా అభిమానులు సంబురాలు జరుపుకుంటున్నారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజనీకాంత్​ పార్టీ ‘మక్కల్​సేవై కర్చీ’పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో రజనీ ‘బాబా లోగోను కోరగా.. దాన్ని కేటాయించేందుకు ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇదిలా ఉంటే పార్టీ జెండా ఇతర విషయాలను ఈ నెలాఖరున రజనీకాంత్​ స్వయంగా వెల్లడించనున్నారు.