15 నుంచి భద్రాద్రిలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు

15 నుంచి భద్రాద్రిలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు

15 నుంచి భద్రాద్రిలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు

వరంగల్ టైమ్స్,భద్రాచలం: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో అక్టోబర్ 15 నుంచి శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. మొదటి రోజు అనగా అక్టోబర్ 15న అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్గించనున్నారు. అక్టోబర్ 16న సంతానలక్ష్మి, 17న గజలక్ష్మి, 18న ధనలక్ష్మి, 19న ధాన్యలక్ష్మి, 20న విజయలక్ష్మి, 21న ఐశ్వర్యలక్ష్మి, 22న వీరలక్ష్మి, 23న మహాలక్ష్మి, 24న విజయదశమి రోజున నిజరూపలక్ష్మిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని ఈవో రమాదేవి తెలిపారు. విజయదశమి రోజున ఆలయ అర్చకులు సంక్షేప రామాయణ హవన పూర్ణాహుతి, మహా పట్టాభిషేకం, విజయోత్సవం,శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామ లీలా మహోత్సవం నిర్వహించనున్నారు.

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు భక్తులు శ్రీమద్రామయణ పారాయణం పఠించనున్నారు. దశమి రోజున పట్టాభిషేకం, సంక్షేప రామాయణ హవనం చేయించుకునేందుకు ఆలయ అధికారులు భక్తులకు అవకాశం ఇచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతీ రోజు 3.30 నుంచి 4.30 వరకు జరిగే కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొనవచ్చు.ఈ పూజా కార్యక్రమాలు దేవస్థాన ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యుల ఆధ్వర్యంలో జరుగనున్నాయని పేర్కొన్నారు.

అక్టోబర్ 28న ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి ఆలయ సన్నిధిలో ఆలయ అధికారులు, అర్చకులు ‘శబరి స్మృతియాత్ర’ నిర్వహించనున్నారు. ఇదే రోజు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అర్చకులు సాయంత్రమే ఆరాధన, దర్భార్ సేవ, చుట్టు సేవను పూర్తి చేసి (ఆలయ కవాట బంధనం) ఆలయ తలుపులు మూసేస్తారు.29న తెల్లవారుజామను 4 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ సంప్రోక్షణ చేస్తారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్గిస్తారు.