వరంగల్ టెస్కో గోదాంలో అగ్నిప్రమాదం

వరంగల్ టెస్కో గోదాంలో అగ్నిప్రమాదం

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : గీసుగొండ మండలం ధర్మారం గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వానికి చెందిన టెస్కో గోదాంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పిల్లలకు సంబంధించిన బెడ్ షీట్లు, బెడ్ షీట్లు, బట్టలు పూర్తిగా మంటల్లో కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.వరంగల్ టెస్కో గోదాంలో అగ్నిప్రమాదంఅగ్ని ప్రమాదంతో రూ. 38 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎవరో కావాలనే గోదాంలో నిప్పటించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.