16 నుంచి ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్

16 నుంచి ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్

ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి ఎర్రబెల్లి, ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు

వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరోసారి పోలీస్ (ఎస్సై) & గ్రూప్స్ (2,3,4) ఉచిత శిక్షణ తరగతులు మే 16 నుండి జ‌న‌గామ‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని బ‌షార‌త్ గార్డెన్స్ లో ప్రారంభం అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా వేలాది మందికి ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ ఇస్తూ, వందలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన స‌తీమ‌ణి ఉషా దయాకర్ రావుల నేతృత్వంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాలకుర్తి నియోజకవర్గంలోని, ప్ర‌త్యేకించి పాల‌కుర్తి, దేవ‌రుప్పుల, కొడ‌కండ్ల మండ‌లాల‌కు చెందిన‌ నిరుద్యోగ యువతీ యువకులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావులు విజ్ఞప్తి చేశారు.

16 నుంచి ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు పాలకుర్తి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆధార్ కార్డు, ఫొటోతో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని వారి ఉద్యోగార్థులకు వారు పిలుపునిచ్చారు. పాల‌కుర్తిలోని బ‌షార‌త్ గార్డెన్స్‌ లో ప్రతి రోజు ఉదయ 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయని తెలిపారు. తరగతులతో పాటు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. వివరాల కోసం సంప్రదించు నెంబరు : 6301026212, 9849686188 ను సంప్రదించాలని వారు కోరారు. కాగా, గతంలో నిర్వహించిన ఈ శిక్షణల ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న ఉద్యోగాల్లో అవకాశాలు పొందాలని వారు చెప్పారు.