జూన్ 2న పంచాయతీ కార్యదర్శి పోస్టుల ధృవపత్రాల పరిశీలన

వరంగల్ రూరల్ జిల్లా: వరంగల్ రూరల్ జిల్లాలో ఖాళీగా వున్న 25 పంచాయతీ కార్యదర్శి పోస్టుల ధృవపత్రాలను జూన్ 2న పరిశీలించనున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఖాళీగా వున్న పంచాయతీ కార్యదర్శి పోస్టులు తాత్కాలిక ప్రాదిపదికన మెరిట్ లిస్టు నుండి ఎంపిక చేయుటకు ధృవీకరణ పత్రాల పరిశీలన తప్పనిసరి అని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 2న పంచాయతీ కార్యదర్శి పోస్టుల ధృవపత్రాల పరిశీలనజూన్ 2న ఉదయం 10.30 గంటలకు జిల్లా పంచాయతీ కార్యాలయంలో ధృవపత్రాల పరిశీలన వుంటుంది కాబట్టి అభ్యర్ధులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆమె కోరారు. ఈ మేరకు అభ్యర్ధుల మెరిట్ లిస్టును జిల్లా పంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించినట్లు కలెక్టర్ హరిత పేర్కొన్నారు.