కరోనాను నియంత్రిస్తూనే.. అభివృద్ధివైపు అడుగులు : దాస్యం

కరోనాను నియంత్రిస్తూనే.. అభివృద్ధివైపు అడుగులు : దాస్యం

వరంగల్ టైమ్స్, వరంగల్ అర్బన్: లాక్ డౌన్ లో భాగంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూనే, తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. పశ్చిమనియోజకవర్గంలోని 30వ డివిజన్ ఏనుగులగడ్డలో సుమారు రూ.30లక్షల వ్యయంతో వేయనున్న రోడ్లు,డ్రైనేజీ అభివృద్ధి పనులను దాస్యం వినయ్ భాస్కర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కరోనాను నియంత్రిస్తూనే.. అభివృద్ధివైపు అడుగులు : దాస్యంఈ అభివృద్ధి పనులను అతిత్వరలోనే పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారి విస్తరిస్తున్న ఈ సమయంలో ఒకవైపు కరోనాని సమర్ధవంతంగా అరికడుతూనే లాక్ డౌన్ కాలాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖామంత్రి కేటిఆర్ లు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుండటం గర్వించతగిన విషయమని అన్నారు.కరోనాను నియంత్రిస్తూనే.. అభివృద్ధివైపు అడుగులు : దాస్యంవరంగల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం హన్మకొండ అమృత గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో 250 మంది నిరుపేదలకు దాస్యం వినయ్ భాస్కర్ నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో 30 వ డివిజన్ కార్పొరేటర్ బోడ డిన్నా, తదితరులు పాల్గొన్నారు.కరోనాను నియంత్రిస్తూనే.. అభివృద్ధివైపు అడుగులు : దాస్యం