ఘనంగా ప్రేయసి షాలినితో హీరో నితిన్ నిశ్చితార్థం

హైదరాబాద్: హీరో నితిన్‌ తన చిరకాల ప్రేయసి షాలినితో ఏడడుగులు వేయబోతున్నారు. ఈ నెల 26న ఈ ప్రేమజంట పెళ్లిపీటలెక్కనున్నారు. బుధవారం నితిన్‌, షాలినిల నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్న నితిన్‌ ‘అండ్‌ ఎంగేజ్‌డ్‌’ అనే వ్యాఖ్యను జోడించారు.. ఈ ఫొటోలో షాలిని వేలికి ఉంగరాన్ని తొడుగుతూ నితిన్‌ కనిపిస్తున్నారు. ఘనంగా ప్రేయసి షాలినితో హీరో నితిన్ నిశ్చితార్థంనితిన్‌ నివాసంలో జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులతో పాటు కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరైనట్లు తెలిసింది. ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు ఫలక్‌నామా ప్యాలెస్‌లో నితిన్‌, షాలినిల పెళ్లి జరుగనుంది. ప్రభుత్వం నిర్దేశించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగానే నిరాడంబరంగా ఈ జంట పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు.