ప్రదీప్ రావుకు భద్రతను కొనసాగించాలి: హైకోర్టు
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావుకు తొలగించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఉన్న 2 ప్లస్ 2 గన్ మెన్లను కేటాయించాలని చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భద్రతను కొనసాగించాలని తెల్పింది. కాగా ప్రదీప్ రావు ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడంతో ఆయనకు కేటాయించిన భద్రతా సిబ్బందిని పోలీసులు తొలగించారు.