ఆస్కార్ బరిలో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’

ఆస్కార్ బరిలో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’

ఆస్కార్ బరిలో నిలిచిన 'ఆర్ఆర్ఆర్'

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నామినేట్ అయింది. 95వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్‌లో నిలిచిన మూవీల జాబితాను ఆస్కార్ అవార్డుల కమిటీ ప్రకటించింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు విభాగాల్లోనూ పోటీపడుతుందని అంతా భావించారు. కానీ దర్శకుడు రాజమౌళి, నటులు జూ. ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ లకు తాజా ప్రకటనతో నిరాశకు గురయ్యారు.

‘నాటు నాటు’ సాంగ్ ఇప్పటికే కాలిఫోర్నియా వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో అవార్డును దక్కించుకుంది. రెండు రోజుల క్రితం జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్‌లో అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌’కేటగిరిలోనూ అవార్డుని ‘ఆర్ఆర్ఆర్’ దక్కించుకుంది. తాజాగా బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అస్కార్కు ‘నాటు నాటు’ నామినేట్ అయింది. మార్చి 12న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ దాదాపు రూ.400 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా రాబట్టింది.