ఆస్కార్ వేడుకల్లో మెరిసిన ఎన్టీఆర్, రామ్ చరణ్

ఆస్కార్ వేడుకల్లో మెరిసిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్

ఆస్కార్ వేడుకల్లో మెరిసిన ఎన్టీఆర్, రామ్ చరణ్వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న ఆస్కార్ అవార్డులు -2023 ప్రధానోత్సవ వేడుకల్లో టాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సందడి చేశారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వస్త్రధారణ చేసుకున్నారు. వీళ్లిద్దరు బ్లాక్ డ్రెస్ వేసుకుని రెడ్ కార్పెట్ పై నడిచి తలుక్కున మెరిసిపోయారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా వేడుకలకు హాజరయ్యారు. బాలీవుడ్ నటి దీపికా పడుకొనే కలిసి రామ్ చరణ్ ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇక దర్శకుడు రాజమౌళి, ఆస్కార్ బరిలో నిలిచిన ‘నాటునాటు’ పాట సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.