బోర్డర్-గావస్కర్ ట్రోపీ భారత్ కైవసం

బోర్డర్-గావస్కర్ ట్రోపీ భారత్ కైవసం

 బోర్డర్-గావస్కర్ ట్రోపీ భారత్ కైవసంవరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఊహించినట్లే భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టు డ్రాగా ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ 3/0తో సోమవారం 5వ రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ప్రశాంతంగా ఆడుకుంది. ట్రావిస్ హెడ్ ( 90 ; 163 బంతుల్లో 10×4, 2×6), లబుషేస్ ( 63 నాటౌట్ ; 213 బంతుల్లో 7×4 ) రాణించడంతో టీ తర్వాత 175/2 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కొన్ని ఓవర్లు ఆడే ఛాన్స్ ఉన్నప్పటికీ టీం ఇండియా బరిలోకి దిగలేదు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో నిర్ణీత సమయానికి ముందే రెండు జట్లు డ్రాకు ఒప్పుకున్నాయి. ఈ ఫలితంతో భారత్ 2-1 తో సిరీస్ ను చేజిక్కించుకుంది.

వరుసగా నాలుగో సారి బోర్డర్-గావస్కర్ ట్రోపీని సొంతం చేసుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ నెగ్గగా, మూడో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అశ్విన్, జడేజాలకు సంయుక్తంగా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. భారత్ గత 3 సిరీసుల్లోనూ ఆస్ట్రేలియాను 2-1 తో ఓడించడం విశేషం. 2017లో సొంతగడ్డపై నెగ్గిన టీం ఇండియా , 2018-19, 2020-21లో ఆస్ట్రేలియాలో ఆడి పై చేయి సాధించింది.