కేసీఆర్ తోనే హైదరాబాద్ అభివృద్ధి : జగదీష్ రెడ్డి

కేసీఆర్ తోనే హైదరాబాద్ అభివృద్ధి : జగదీష్ రెడ్డి

సరూర్ నగర్ : హైదరాబాద్ అభివృద్ధి కి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని టిఆర్ఎస్ ప్రభుత్వం 67 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మొత్తం తో జరిగిన అభివృద్ధి పై టి ఆర్ యస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్ విడుదల చేసిన ప్రగతి నివేదిక ను టి ఆర్ యస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.జి హెచ్ యం సి ఎన్నికల ప్రచారంలో బాగంగా శనివారం సాయంత్రం ఓ ప్రవైట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సరూర్ నగర్ డివిజన్ విస్తృత స్థాయి సమావేశంలో మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలసి మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 2014 కు ముందు తరువాత జరిగిన హైదరాబాద్ అభివృద్ధి ని ప్రజల్లోకి తీసుకు పోవడంలో కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. తద్వారా విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నివారించడం తో పాటు టి ఆర్ యస్ విజయానికి దోహదపడుతుందని ఆయన చెప్పారు. 2014 కు ముందు విద్యుత్ కొరత తో పరీక్షలు వస్తున్నాయి అంటే నే తల్లి తండ్రులకు గుబులు మొదలయ్యేదని అటువంటి పరిస్థితిని అధిగమించింది టి ఆర్ యస్ పాలన లోనే అదీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోనే అన్నది మరిచిపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.అంతకు మించి తాగు నీటికి హైదరాబాద్ ప్రజలు పడ్డ కష్టాలు వర్ణనాతీతం అని అటువంటి ప్రజలకు అటు కృష్ణా ఇటు గోదావరి నీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు. టి ఆర్ యస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నైపుణ్యతతోటే ప్రపంచపఠం లో తెలంగాణా గుర్తింపు వచ్చేలా చోటు దొరికిందని ఆయన తెలిపారు. అన్నింటికీ మించి షి టీం లు…సి సి కెమెరాలతో హైదరాబాద్ లో రక్షణ వ్యవస్థను పతిష్టవంతం చేసిన అంశాన్ని మహిళలు స్వాగతిస్తున్నారని ఆ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో విరివిగా మహిళలోకి తీసుకెళ్లాలని మంత్రి జగదీష్ రెడ్డి టి ఆర్ యస్ క్యాడర్ కు లీడర్ కు విజ్ఞప్తి చేశారు. యింకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి టి ఆర్ యస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి సరూర్ నగర్ డివిజన్ టి ఆర్ యస్ అభ్యర్థిని పారుపల్లి అనితా దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.