మరోసారి విఫలమైన భారత్

మరోసారి విఫలమైన భారత్అడిలైడ్:  ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా ఘోరంగా విఫలమైంది. అడిలైడ్ లో శనివారం మూడో రోజు ఆట మొదలైన రెండో ఓవర్ నుంచే వికెట్ల వేట మొదలెట్టిన ఆసీస్ బౌలర్లు గంటన్నరలో భారత బ్యాట్స్ మెన్ ను కుప్పకూల్చారు. హాజిల్ వుడ్ 5/8, కమిన్స్ 4/21 నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో భారత బ్యాటింగ్ లైనప్ ఒక్కసారిగా కుప్ప కూలింది. 31 పరుగుల వద్ద హనుమ విహారి రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమి (1) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 21.2 ఓవర్లలో టెస్టు చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోరు ( 36/9)తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 53 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా నమోదైంది. ఇందులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, టాప్ స్కోరర్లు.

గతంలో టెస్టు క్రికెట్లో అత్యల్ప స్కోర్లు ఇవే..

*1924లో దక్షిణాఫ్రికా మళ్లీ ఇంగ్లాండ్ పైనే 30 పరుగులు

*1932లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా చేతిలో 36 పరుగులకు ఆలౌటైంది.

*1955లో న్యూజిలాంట్ టీం ఇంగ్లాండ్ పై అత్యల్ప స్కోరు 26 పరుగులే నమోదు చేసింది.

*1974లో టీం ఇండియా ఇంగ్లాండ్ చేతిలో 42 పరుగులకు ఆలౌటైంది. దీనిని కోహ్లీసేన నేడు తిరగరాసింది.

*2020 ఆస్ట్రేలియా చేతిలో భారత్ 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేసింది.