భారత్ ఆలౌట్.. ఆసిస్ 47 రన్స్ ఆధిక్యం
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి తొలుగ బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ కంటే ఆస్ట్రేలియా జట్టు 47 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.