రానే వచ్చింది.. ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌

రానే వచ్చింది.. ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌

రానే వచ్చింది.. ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌

వరంగల్ టైమ్స్,ముంబయి : క్రికెట్ అభిమానులకు వేసవికాలంలో వినోదం పంచే ఐపీఎల్‌-2023 సీజన్ షెడ్యూల్ రానే వచ్చింది. ఐపీఎల్‌-2023 సీజన్‌ షెడ్యూలును బీసీసీఐ ప్రకటించింది. మార్చి 31 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. 52 రోజుల పాటు అభిమానులకు అసలైన క్రికెట్ వినోదాన్ని అందివ్వనుంది. మే 28న టైటిల్ పోరు జరుగనుంది. 16వ సీజన్ తొలి మ్యాచ్ లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో సీజన్‌ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో 12 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 70 మ్యాచ్‌లుంటాయి.

హైదరాబాద్ వేదికగా 4 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఏప్రిల్ 2న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్, హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఏప్రిల్ 9న సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 18న సన్ రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 24న సన్ రైజర్స్ హైదరాబాద్- ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో మ్యాచ్ లు జరుగుతాయి.