ఆ కౌన్సిలర్లకు ఓటు వేసేందుకు గ్రీన్ సిగ్నల్

ఆ కౌన్సిలర్లకు ఓటు వేసేందుకు గ్రీన్ సిగ్నల్

ఆ కౌన్సిలర్లకు ఓటు వేసేందుకు గ్రీన్ సిగ్నల్

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే హక్కు లేదని తీర్పు చెప్పింది. 24 గంటల్లోగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నిక నిర్వాహణ తేదీని కూడా ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులతో ఆమ్ ఆద్మీ పార్టీకి కొండంత బలం వచ్చినట్లైంది.

ఢిల్లీ మేయర్ ఎన్నికలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన 10 మంది కౌన్సిలర్లకు మేయర్ ఎన్నికలో ఓటు వేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. నామినేటెడ్ సభ్యులంతా బీజేపీకి ఓటేస్తారని వాదించింది. డీఎంసీ యాక్ట్ 1957 ప్రకారం నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే అధికారం లేదని చెప్పింది. ఈ క్రమంలో మూడుసార్లు ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆప్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

తక్షణమే ఎన్నిక జరపాలని ఆదేశించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయవద్దని చెప్పింది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక సమావేశం నిర్వహించగా నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు విషయంలో బీజేపీ, ఆప్ ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో ఆప్ సుప్రీంకోర్డును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తక్షణమే ఎన్నిక జరపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మేయర్ ఎన్నిక జరగనుంది. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాగా మోజారిటీ ప్రకారం మేయర్ సీటును ఆప్ దక్కించుకోనుంది.