తారకరత్న లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌

తారకరత్న లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌

తారకరత్న లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌వరంగల్ టైమ్స్, బెంగళూరు : గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి తాజాగా అప్‌డేట్‌ వచ్చింది. గురువారం తారకరత్నకు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన హెల్త్‌ బులిటెన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

 

జనవరి 27న కుప్పంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తారకరత్నకు గుండెపోటు రాగా ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. విదేశీ వైద్యులను ఆ ఆస్పత్రికి రప్పించి ట్రీట్‌మెంట్‌ చేయిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.