శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. పీఎస్‌ఎల్‌వీ –సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈనెల 17 న మహూర్తంగా నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని సత్వరం అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో సాగించే నిరంతర ప్రక్రియ మరింత వేగవంతమైంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 17న సాయంత్రం 3:41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ –సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు ఇస్రో రెఢీ అవుతోంది. 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు ఇస్రో అధికారులు. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్(వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది.
Latest Updates
