జేఈఈ మెయిన్​ షెడ్యూల్​ విడుదల

జేఈఈ మెయిన్​ షెడ్యూల్​ విడుదలన్యూఢిల్లీ: జేఈఈ మెయిన్​ 2021 షెడ్యూల్​ను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ నిషాంక్​ షెడ్యూల్​ వివరాలను వెల్లడించారు. 2021లో మొత్తం నాలుగు దశల్లో జేఈఈ మెయిన్​ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మొదటి దశ పరీక్షలను ఫిబ్రవరిలో, రెండో దశ మార్చిలో, మూడో దశ ఏప్రిల్​లో, నాలుగో దశ మే నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొదటి దశ ఎగ్జామ్స్​ తేదీలను కూడా మంత్రి వెల్లడించారు. ఫిబ్రవరి 23 నుంచి26 వరకు నాలుగు రోజులపాటు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఆఖరి పరీక్ష తర్వాత నాలుగైదు రోజుల్లోనే రిజల్ట్స్​ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. 2021లో జరుగునున్న జేఈఈ మెయిన్​ పరీక్షల్లో నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ పలు మార్పులు చేసింది. గతంలో రెండు దశల్లో నిర్వహించిన ఈ పరీక్షలను ఇప్పుడు నాలుగు దశలకు పెంచింది. అలాగే ప్రశ్నాపత్రంలో ప్రాంతీయ భాషలను కూడా చేర్చింది. కరోనా వైరస్​ దృష్ట్యా పరీక్ష సెంటర్ల సంఖ్యను పెంచుతూ షెడ్యూల్​ వెల్లడించింది.