పట్నా: బీహార్ లో లాలూప్రసాద్ యాదవ్ ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. బీజేపీ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ చీఫ్ లాలూ చేసిన ఫోన్ కాల్స్ బీజేపీ బయటపెట్టింది. రాంచీ జైలు నుంచే ఎమ్మెల్యేలకు 8051216302 నంబర్ నుంచి కాల్ చేస్తున్నారంటూ బీజేపీ నేత ,మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ ఆరోపించారు. జైలులో ఉంటూ ఈలాంటి రాజకీయాలు చేయడం పై ఆయన మండిపడ్డారు. అయితే లాలూ ఫోన్ సంభాషణలు ఇప్పుడు బీహార్లో దుమారం రేపుతున్నాయి. ఓటింగ్ కు దూరంగా ఉంటే మంత్రి పదవి ఇస్తామని చేసిన లాలూ ఆడియో క్లిప్లు లు బయటకు వచ్చాయి. బీజేపీ ఎమ్మేల్యేలతో లాలూ మాట్లాడిన మాటలు ఇవి. .. స్పీకర్ ఎన్నికలకు హాజరు కావద్దు. కరోనా వచ్చిందని చెప్పండి. మద్దతు ఇస్తే మా నాయకుడు స్పీకర్ అవుతాడు. అప్పుడు మీకు కావాల్సిన పనులు అవుతాయని లాలూ ఆఫర్ చేశాడు. ప్రస్తుతం లాలూ మాట్లాడిన ఈ ఆడియో క్లిప్పు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.