బీజేపీ నాయకురాలు ఖుష్బూకు కరోనా

బీజేపీ నాయకురాలు ఖుష్బూకు కరోనాచెన్నై : ప్రముఖ నటి, బీజేపీ మహిళా నాయకురాలు ఖుష్బూకు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా సోకడంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. తొలి రెండు వేవ్ ల నుంచి తప్పించుకున్నా చివరికి థర్డ్ వేవ్ లో నాకు కరోనా వైరస్ సోకింది.

ఆదివారం సాయంత్రం కూడా నెగెటివ్ వచ్చింది. జలుబు బాగా ఉండటంతో ఈ ఉదయం మరోసారి టెస్ట్ చేయించగా, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఖుష్బూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఒంటరిగా ఉన్నానని, మరో 5 రోజులు నన్ను ఎంటర్టైన్ చేయండి అంటూ ఖుష్బూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.