రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా

రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనాన్యూఢిల్లీ : రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా వైరస్ సంక్రమించింది. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తన ట్విట్టర్ లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని అన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనతో టచ్ లో ఉన్నవారు ఐసోలేట్ కావాలని, వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేడు ఢిల్లీలో పాజిటివిటీ రేటు 23 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నగరంలో గడిచిన 24 గంటల్లో 22,751 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆంక్షలను కఠినతరం చేయనున్నారు. రెస్టారెంట్లలో సీట్లను తగ్గించాలన్న ఆలోచనలో ఉన్నారు. టేకవేలను పెంచనున్నారు. భారత్ లో ఆదివారం 1,78,723 కేసులు నమోదయ్యాయి. వీరిలో 147 మంది మరణించారు.