ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్

వరంగల్ అర్బన్ జిల్లా: రాజీ మార్గమే రాజా మార్గమని వరంగల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ నర్సింహ రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జిల్లా కోర్టులో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. ఈ నెల 12 వ తేదీన న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1295 కేసులనులను గుర్తించామన్నారు. ప్రజలకు అనేక మార్గాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులల్లో ఏళ్లతరబడి మూలుగుతున్న కేసులను త్వరితగతిన క్లియర్ చేసేందుకు లోక్ అదాలత్ లు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. కోవిడ్19 నిబంధనలను పాటిస్తూ జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ నర్సింహ రావు బాధిత ప్రజలకు పిలుపునిచ్చారు.