కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవితహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తల కృషి అభినందించదగిన విషయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్,సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ లు ఆమె నివాసంలో కవితను మర్యాద పూర్వకంగా కలిసారు .ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను, సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ లను కవిత అభినందించారు. టీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఆదరించిన ప్రతీ ఒక్కరికి టీఆర్ఎస్ పార్టీ రుణ పడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టేనని ఆమె ఉద్ఘాటించారు. అనంతరం శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్, సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, యువనేత రాగం అనిరుధ్ యాదవ్ లు ఆమెకు పూల మాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు రవి యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, డివిజన్ ఉపాధ్యక్షులు పన్యల యాద గౌడ్, విష్ణు వర్ధన్ రెడ్డి, దినేష్, రవి యాదవ్, గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, శ్రీకాంత్, మహేందర్ సింగ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.