ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత

వరంగల్ టైమ్స్ ,హైదరాబాద్‌:  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ వాసులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14లో గల బీయస్ డీఏవీ పబ్లిక్ పాఠశాలలో ఎమ్మెల్సీ కవిత ఓటు వేశారు. అనంతరం ‌మీడియాతో మాట్లాడుతూ, ఎప్పుడు ఎన్నికలు‌ జరిగినా, హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తక్కువ అవుతుందని, కానీ ప్రజలంతా బయటకు వచ్చి, తమకు ఇష్టమైన పార్టీకి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవితప్రజల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం పరిపూర్ణమవదన్నారు. తప్పకుండా ‌ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. హైదరాబాద్ నగర అభివృద్ధిని చూసి, ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. కోవిడ్ నిబంధనలు, చలి తీవ్రత కారణంగా ఉదయం ఓటింగ్ నెమ్మదిగా జరిగిందన్న ఎమ్మెల్సీ కవిత, పోలింగ్ ముగిసే లోపు ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు టీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ కవిత.