వివాదరహితుడు నోముల నర్సింహయ్య: కేటీఆర్​

వివాదరహితుడు నోముల నర్సింహయ్య: కేటీఆర్​హైదరాబాద్‌: నోముల రాజకీయ జీవితమంతా ప్రజాపోరాటాలతోనే కొనసాగిందని ఆయన వివాదరహితుడని టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ అన్నారు. నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల మృతి పట్ల కేటీఆర్​ సంతాపం తెలిపారు. మంగళవారం కొత్తపేటలోని ఆయన నివాసంలో నోముల భౌతిక కాయానికి నివాళులర్పించారు. కేసీఆర్‌ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. ఆయన మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు. పార్టీ తరఫున తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.