ఎర్రబెల్లికి ఎదురే లేదు ? 

ఎర్రబెల్లికి ఎదురే లేదు ?

ఎర్రబెల్లికి ఎదురే లేదు ? 

వరంగల్ టైమ్స్,టాప్ స్టోరి : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుది ప్రత్యేకస్థానం. 1994 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ దూసుకుపోతున్నారాయన. ఇప్పటి వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, డబుల్ హ్యాట్రిక్ కొట్టారు.ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ స్థాయిలో వరుస విజయాలు నమోదు చేసిన ఏకైక నాయకుడు ఎర్రబెల్లి మాత్రమే అని చెప్పవచ్చు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచేందుకు ఎర్రబెల్లి సిద్ధమవుతున్నారు.

*మళ్లీ ఎర్రబెల్లికే పట్టం!
పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలకుర్తిలో ప్రతీ ఊర్లోనూ ఎర్రబెల్లికి అనుచరగణం ఉంది. ప్రజలను పేరు పెట్టి పిలిచేంత చనువుంది. అన్నా, అక్కా, అవ్వా, తమ్మీ అంటూ ప్రతీ ఒక్కరిని తమ వారిగా భావించి పలకరించడం ఎర్రబెల్లికే సాధ్యం. అందుకే ఎర్రబెల్లిని పాలకుర్తి జనం తమ సొంతింటి వ్యక్తిలా భావిస్తారు. ఎన్నికల సమయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా ఎర్రబెల్లిని గెలిపించుకుంటారు. అంతేకాదు మరోసారి కూడా ఎర్రబెల్లిని గెలిపించుకోవడానికి జనమంతా సిద్ధంగా ఉన్నారు.

ఎర్రబెల్లికి ఎదురే లేదు ? 

*ఎర్రబెల్లిపైనే హైకమాండ్ దృష్టి
ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారట. నియోజకవర్గంలో ప్రతీ ఊరును కవర్ చేసేలా పకడ్బందీ ప్లానింగ్ ను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధిని గడపగడపకు చేరవేసేలా గులాబీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో నేతలు, కార్యకర్తలతో ఎర్రబెల్లి స్వయంగా మాట్లాడి, దిశానిర్దేశం చేస్తున్నట్లు టాక్. అయితే గులాబీ శ్రేణులు మాత్రం ఇంత ప్లానింగ్ అవసరం లేదని, ఎర్రబెల్లి గెలుపు లాంఛనమేనని చెబుతున్నారు.అంతేకాదు హైకమాండ్ కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి సేవలను ఎక్కువగా వాడుకునేందుకు సిద్ధమవుతోందట. ఎర్రబెల్లిని పాలకుర్తికే పరిమితం చేయకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆయన ప్రచారం చేసేలా ప్లానింగ్ జరుగుతోందని టాక్. గులాబీ శ్రేణులంతా కూడా ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు. దీంతో ఈసారి పాలకుర్తి ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి ఎక్కువగా పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది.

*వార్ వన్ సైడే అంటున్న ప్రజలు..
ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి పాల్గొన్నా, పాల్గొనకపోయినా పాలకుర్తిలో మాత్రం వార్ వన్ సైడ్ అన్న మాట అయితే బలంగా వినిపిస్తోంది. అన్నివర్గాల జనం ఎర్రబెల్లి నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. ప్రజలకు అండగా ఉంటున్న ఇంతమంచి నాయకుడిని వదులుకోబోమని తేల్చిచెబుతున్నారు. ఎర్రబెల్లికి ఎంత మెజార్టీ వస్తుందో అని లెక్కలు వేసుకుంటున్నారు.

* ఆ పార్టీల నుంచి ఇంకా క్లారిటే లేదు..
ఎర్రబెల్లి దయాకర్ రావుకు పాలకుర్తిపై ఉన్న పట్టును చూసి ఇతర రాజకీయ పార్టీలు పరేషాన్ అవుతున్నాయి. ఎర్రబెల్లిని ఓడించడం దాదాపు అసాధ్యం అనే పరిస్థితికి చేరుకున్నాయి. సీనియర్ నాయకుడు అయిన ఎర్రబెల్లి యువ నాయకుడిలా ఉత్సాహంతో ముందుకు కదులుతుంటే, పాలకుర్తిలో కాంగ్రెస్, బీజేపీలో మాత్రం నైరాశ్యం నెలకొంది. ఎవరిని బరిలోకి దించాలా అన్న ఆలోచనలోనే కాలం గడిపేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి జంగా రాఘవరెడ్డి పేరు వినిపిస్తున్నా, ఆయన పేరే ఫైనల్ అవుతుందని చెప్పలేం. బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు.

ఎర్రబెల్లికి ఎదురే లేదు ? 

* పాలకుర్తి గడ్డ..ఎర్రబెల్లి అడ్డా..
కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉన్నా ఎర్రబెల్లి స్ట్రెచర్ కు మ్యాచ్ అయ్యే నాయకుడు పాలకుర్తిలో లేడని గులాబీ శ్రేణులు బల్లగుద్ది చెబుతున్నారు. అందుకే పాలకుర్తి గడ్డ ఎర్రబెల్లి అడ్డా అని తేల్చిచెబుతున్నారు. జనం కూడా ఈ సారి ఎర్రబెల్లిని మరింత భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎర్రబెల్లికి వచ్చే మెజార్టీ ఎంతో తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.