కళాతపస్వి కే.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి

కళాతపస్వి కే.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి

కళాతపస్వి కే.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అలనాటి ప్రముఖ లెజండరీ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిసాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతియ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందు ఫిలిం చాంబర్ లో కే.విశ్వనాథ్ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని కళాతపస్వికి తుది వీడ్కోలు పలికారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కే.విశ్వనాథ్ అపోలో హాస్పిటల్ లో చికిత్సపొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీతో పాటు వివిధ సినీ పరిశ్రమల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కే.విశ్వనాథ్ ఎన్నో మరుపురాని సినిమాలతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని గుర్తు చేసుకున్నారు.