పెట్టుబడులపై విషం చిమ్ముతున్న ప్రతిపక్షాలు

పెట్టుబడులపై విషం చిమ్ముతున్న ప్రతిపక్షాలు

*11 నెలల్లో రూ. 44 వేల కోట్ల పెట్టుబడులు
*అయినా పెట్టుబడులు రాలేదంటూ ప్రతిపక్షాల విషం
*నవరత్నాల కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణ మూర్తి

పెట్టుబడులపై విషం చిమ్ముతున్న ప్రతిపక్షాలు

వరంగల్ టైమ్స్, తాడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో రూ. 44,985 కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించిందని నవరత్నాల కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణ మూర్తి తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

2019-21 లో 42 ప్రాజెక్టుల రూపంలో రూ. 9,840 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. అదే విధంగా 2021-22లో మొత్తం 47 ప్రాజెక్టులతో కలిపి రూ. 10,350 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. కేవలం గత 11 నెలల్లోనే జనవరి నుంచి నవంబర్ 2022 వరకు మొత్తం 45 పారిశ్రామిక పెట్టుబడుల ప్రాజెక్ట్‌లతో ఏపీలో పెట్టుబడులు రూ. 44,985 కోట్లకు చేరిందని ఇది 2021 కంటే నాలుగు రెట్లు అధికమని నారాయణ మూర్తి అన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు లేవని ప్రతిపక్షాలు కావాలనే విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. ఈ రోజు నేను చూపించిన డేటా ప్రభుత్వం పెట్టుబడుల రూపంలో సాధించిన ఘనతకు రుజువని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు సులువుగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని వివరించారు. నిష్పక్షపాతంగా అనుమతులు ఇవ్వడమే కాకుండా పెట్టుబడిదారులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసం విపరీతంగా పెరిగిందని, అది రోజురోజుకూ మరింత బలపడుతుందని నారాయణ మూర్తి పేర్కొన్నారు.