మాకులేని నొప్పి మీకెందుకు..!

మాకులేని నొప్పి మీకెందుకు..!

మాకులేని నొప్పి మీకెందుకు..!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నామని స్వర్గీయ ఎస్వీ రంగారావు మనవళ్లు సినీ నటుడు ఎస్వీ రంగారావు (చిన్న) , ఎస్వీఎల్సీ రంగారావు ( బాబాజీ) అన్నారు. మాకు, బాలకృష్ణకి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.