ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్న యువకుడి అరెస్ట్

ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్న యువకుడి అరెస్ట్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : యువతి ఫోటోలను ఆశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషన్ మీడియా పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిని గీసుగొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాలను వెల్లడించారు. వరంగల్ కోట మండలం, దూబకుంట గ్రామానికి చెందిన జన్ను విజయకుమార్ (27) గత సంవత్సరకాలంగా అదే గ్రామానికి చెందిన యువతితో ఫోన్ ద్వారా చాటింగ్ చేసేవాడు.ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్న యువకుడి అరెస్ట్ఈ ఛాటింగ్ వ్యవహారం సదరు యువతి అక్క (బాధితురాలు) దృష్టికి రావడంతో నిందితుడిని యువతి అక్క మందలించింది. యువతి అక్కపై కక్షగట్టిన నిందితుడు ఆమె పరువు తీయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వక్ర ఆలోచన చేసాడు. అశ్లీల రీతిలో మార్ఫింగ్ చేసిన బాధితురాలి ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్లను బాధితురాలి ఫోన్ కు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించేవాడు. యువకుడి బెదిరింపులకు భయపడిపోయిన బాధితురాలు గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం విభాగం సహకారంతో చేపట్టిన దర్యాప్తులో గీసుగొండ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి హెచ్చరించారు. నిందితుడిని గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన గీసుగొండ ఇన్స్పెక్టర్ సట్లరాజు, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ జనార్థన్ రెడ్డి, ఎస్.ఐ వెంకన్న, కానిస్టేబుళ్ళు కిషోర్, సంపత్ లను ఈస్ట్ జోన్ డీసీపీ అభినందించారు.