న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదోరోజూ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌పై 8 పైసలు, డీజిల్‌పై 18 నుంచి 20 పైసలు పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.81.59కి, డీజిల్ ధర రూ.71.41కి పెరిగింది. అదేవిధంగా మూడు మెట్రో నగరాల్లో కూడా ధరలు పెరిగనట్లు ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.29, డీజిల్ ధర రూ.77.90గా ఉన్నది. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.84.64, డీజిల్ రూ.76.88, కోల్‌కతాలో పెట్రోల్ రూ.83.15, డీజిల్ రూ.74.98, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.84.86 డీజిల్ రూ.77.93గా ఉన్నాయి.